అజ్మీర తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు
27-08-2026 10:40 PM
పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని అజ్మీర తండా గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో బీజేపీ కోనరావుపేట మండల అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ పాల్గొన్నారు. అజ్మీర తండా సర్పంచ్ జయరాం, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు వినోద్ ఆహ్వానం మేరకు ఆయన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి సేవాలాల్ మహారాజ్, జగదాంబ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంతో పాటు తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.అనంతరం తండాలోని యువతతో కలిసి మిర్యాల్కర్ బాలాజీ నృత్యం చేస్తూ తీజ్ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.






