4 May, 2026 | 9:04 PM

సుల్తానాబాద్‌లో బీజేపీ నాయకుల సంబరాలు

04-05-2026 07:52 PM

టపాసులు పేల్చివేత... మిఠాయిల పంపిణీ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచెర్రి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్బంగా సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండల కేంద్రంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా బీజేపీ పై ప్రజలు ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా  ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు కందునురి కుమార్,మాజీ సర్పంచ్ మేకల కార్తీక్ యాదవ్,బెజ్జంకి దిలీప్,కొల్లూరి సంతోష్ కుమార్, కోట నాగేశ్వర్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి,ఎర్రం సంతోష్ రెడ్డి,మాటూరి వెంకటస్వామి,మెందే శంకరయ్య,ఎలావేనా తిరుపతి, గుడ్ల వెంకటేష్,ఆగండ్ల గట్టయ్య, గజాబేంకార్ పవన్, బుసరపు సంపత్, శేఖర్ మాస్టర్,వలస సాయి కుమార్, ఎగుర్ల రాజయ్య,మహేష్ పటేల్, సోడా శ్రీనివాస్, శాలిగంటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.