బౌద్ధ మహాసభ 71వ స్థాపన దినోత్సవం
04-05-2026 07:55 PM
వాంకిడి,(విజయక్రాంతి): భారతీయ బౌద్ధ మహా సభ 71వ స్థాపన దినోత్సవాన్ని సోమవారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ 1955 మే 4న అంబెడ్కర్ భారతీయ బౌద్ధ మహా సభ అనే సామాజిక సేవ సంస్థను ప్రారంభించారు. భారత దేశoలో అంటరాని తనాన్ని ఎదురు కొంటున్న పంచములకు గౌరవ ప్రదమై న, జీవితాన్ని ఇవ్వడానికి అంబెడ్కర్ ఆ రోజే మొదటి అడుగు వేశారని అన్నారు. అంతకు ముందు బుద్ధుడు, అంబెడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.






