15 June, 2026 | 10:15 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కాంగ్రెస్ పథకాలను బీజేపీ కాపీ కొడుతోంది

14-10-2025 01:05 AM

ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్

నిర్మల్, అక్టోబర్ ౧౩ (విజయక్రాంతి): కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభు త్వ హామీ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ హోటల్ లో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావుతో కలిసి సోమవారం మీడి యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సం స్థగతంగా బలోపేతం చేసేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్‌” కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు (డీసీసీ) ఎంపిక చేయనున్నారని దీని కోసం ఏఐసీసీ పరిశీలకులను నియమించిందని తెలిపారు. దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజలను విభజించి పాలిస్తుందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మూ డేళ్ల గడువు ఉందని, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ స్థాయిలో ఇంటింటికి తీసుకెళ్లాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి సముద్రాల వేణుగోపాలచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్, సారంగాపూర్ నిర్మల్ భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు అబ్దుల్ హాది, సోమా భీమ్ రెడ్డి, ఆనంద్ రావు పటేల్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ రాం రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని,

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేణి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సమరసింహారెడ్డి, వివిధ మండల పార్టీ అధ్యక్షుడు విజేందర్ వివిధ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్, కుంట వేణుగోపాల్, నక్కల మధుకర్ రెడ్డి, తక్కల విద్యాసాగర్ రెడ్డి, గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, బొల్లోజు నరసయ్య, పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ, (చిన్ను ) వివిధ ఆలయాల చైర్మన్లు, డైరెక్టర్‌లు పాల్గొన్నారు.