ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం
దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ బీజేపీ
మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
నవాబ్‌పేట్: మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... భారత మాత సేవలో బీజేపీ అంకితభావంతో పనిచేస్తోందని కొనియాడారు.
దేశ ప్రయోజనాలు, ధర్మ రక్షణే లక్ష్యంగా పార్టీ స్థాపించబడిందని ఆయన గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నేడు ప్రపంచ దేశాల ముందు అత్యున్నత స్థాయిలో నిలుస్తోందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సాగుతోందని పేర్కొన్నారు.ఆర్థిక, సామాజిక రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి కార్యకర్త దేశం కోసం నిరంతరం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ ఆవిర్భావ వేడుకల్లో మండల నాయకులు గణేష్ చారి,రవి,కమలాకర్ ,యామిని ,బసవరాజు,శివాజీ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.




