6 April, 2026 | 9:44 PM

ట్రాఫిక్ అవగాహన డ్రైవ్ – నియమాలే ప్రాణరక్షణ

06-04-2026 07:41 PM

హుస్నాబాద్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై సోమవారం అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. లైసెన్స్ లేని వారు వెంటనే పొందాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం ప్రమాదకరమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.