11 June, 2026 | 6:06 PM

సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్‌గా మహిపతి రాజేశ్వరరావు

11-06-2026 04:55 PM

మణుగూరు, జూన్ 11(విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో డిప్యూటీ తహ శీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న మహి పతి రాజేశ్వరరావు మణుగూరు సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్‌గా నియమితు లయ్యారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయనకు ఈ బాధ్యతలు అప్ప గించినట్లు తెలిసింది. మణుగూరు ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడి ఎస్), రేషన్ సరుకుల పంపిణీ, సివిల్ సప్లై శాఖకు సంబంధించిన పరిపాలనా వ్యవ హారాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

అశ్వాపురంలో డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహి స్తున్న ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందిం చిన అధికారిగా గుర్తింపు పొందారు. మణుగూరులో కూడా అదే స్థాయిలో సేవలందిస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఆయన  సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.