11 June, 2026 | 6:20 PM

వైభవంగా ముగిసిన భాగవత సప్తాహజ్ఞాన యజ్ఞం

11-06-2026 04:56 PM

- రుక్మిణి పాండురంగ స్వామికి క్షీరాభిషేకం, పుష్పార్చన కళ్యాణ మహోత్సవం

గజ్వేల్, (విజయక్రాంతి): మర్కుక్ మండలం భవానందపూర్ పాండురంగ ఆశ్రమంలో వారం రోజులుగా జరుగుతున్న భాగవత సప్తాహజ్ఞాన యజ్ఞం వైభోగంగా ముగిసింది. తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ సిద్ధాంతిచే భాగవత ప్రవచనంలో భక్తులంతా మై మరచిపోయారు. భాగవత సప్తాహ పారాయణ ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు అఖండ హరే రామ నామ మంత్రం, శ్రీ రుక్మిణి పాండురంగ స్వామికి క్షీరాభిషేకము, పుష్పార్చన, రాధాకృష్ణుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి. వ్యాసపీఠ పూజ అనంతరం తంగిరాల రాజేంద్రప్రసాద శర్మను ఘనంగా సన్మానించారు.  నిత్యం కార్యక్రమాల్లో పాల్గొంటున్న భక్తులు గురువారం మరింత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులందరికీ భోజన ప్రసాద వసతి ఏర్పాటు చేశారు.