6 April, 2026 | 9:47 PM

పాల్వంచలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

06-04-2026 07:46 PM

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో పార్టీ 47 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు "దేశం ప్రథమం.. ఆ తర్వాతే పార్టీ.. చివరగా మనం" - ఇది కేవలం నినాదం కాదు, ప్రతి బిజెపి కార్యకర్త నరనరాన జీర్ణించుకున్న జీవన వేదం అని శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జాతీయవాదం, దీనదయాళ్ గారి అంత్యోదయ, వాజ్ పేయి గారి సుపరిపాలన.. వీటన్నింటి కలయికే నేటి మోదీ  'వికసిత్ భారత్' సంకల్పం. బీజేపీ పార్టీ ఎన్నో అవమానాలు, దాడులు, బలిదానాలను దాటుకుని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిందన్నారు.