పోలీస్ కస్టడీలో నిందితురాలి మృతి
పోలీస్ అధికారుల నిర్లక్ష్యంపై citu దళిత, మైనార్టీ ప్రజా సంఘాల ఆరోపణ.
తాండూర్, జూన్ 11, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ మహిళల జంట హత్య కేసులో నిందితురాలుగా ఉన్న కరీమా బేగం పోలీస్ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య యత్నానికి పాల్పడి మృతి వెనుక వికారాబాద్ జిల్లా కరణ్‌కోట్ పోలీస్ స్టేషన్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని వారిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ప్రజా సంఘాలు ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు . గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పోలీస్ కస్టడీలో సురక్షితంగా ఉండాల్సిన బాధ్యత పోలీసులదే. ఆమె ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వ్యవస్థలోని లోపాలను, విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుందని విమర్శించారు.
ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం సరిపోదని, దీనికి పరోక్షంగా బాధ్యులైన ఉన్నతాధికారులపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో కే శ్రీనివాస్, అబ్దుల్ వాహాబ్ ,గోపి రజక కే చంద్రయ్య , సాధిఖ్, గుమ్మడి రత్నం ఉన్నారు






