9 April, 2026 | 6:48 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

తుంగతుర్తిలో బిజెపి ఇంటింటికి జోరుగా ప్రచారం

30-11-2025 01:57 PM

బిజెపి అభ్యర్థి సాయిబాబా గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి గ్రామ సమస్యలపై ప్రజల కోసం రాజులేని పోరాటం చేసిన బిజెపి అభ్యర్థి, మల్లె పాక. సాయిబాబాను భారీ మెజార్టీతో గెలిపించాలని బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్రావు కోరారు. ఆదివారం మండల కేంద్రంలో పలు వీధుల గుండా ఇంటింటికి తిరుగుతూ మల్లెపాక సాయిబాబాను గెలిపించాలని కోరుతూ, స్థానిక ఓటర్లను, ఓటును అభ్యర్థించారు. గ్రామంలో ఉన్న సమస్యలైన నూతన డ్రైనేజీ, నూతన సిసి రోడ్లు, పలు వీధుల్లో వీధి దీపాలు, మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమేష్ లింగయ్య ,వెంకన్న, రఫిక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.