కేరళలో 75 శాతం పోలింగ్ నమోదు
తిరువనంతపురం: అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు అసోంలో 84.42 శాతం పోలింగ్, పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్ నమోదైంది. గురువారం నాడు 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుండగా, సాయంత్రం 5 గంటల సమయానికి కేరళలో ఓటింగ్ శాతం 75 శాతాన్ని(Kerala Polling Percentage) దాటింది.
ఈ కీలక ఎన్నికలు అధికార LDF వరుసగా మూడవసారి అధికారాన్ని దక్కించుకుంటుందా, UDF తిరిగి పుంజుకుంటుందా, లేక సాధారణంగా రెండు ప్రధాన కూటముల మధ్యే సాగే ఈ పోరులో బీజేపీ ఏదైనా ఆశ్చర్యకర ఫలితాన్ని నమోదు చేస్తుందా? అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఎన్నికల సంఘం (EC) గణాంకాల ప్రకారం, సాయంత్రం 5 గంటల నాటికి, 2.71 కోట్ల మంది ఓటర్లలో 75.01 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.




