9 April, 2026 | 7:52 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..

09-04-2026 05:53 PM

మునుగోడు అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్నాను

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు లోని ప్రభుత్వ పాఠశాలలలో(Munugode government schools) విద్య బలోపేతం చేయడానికి కృషిచేసి,అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు . గురువారం మండలంలోని పులిపలుపుల గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ డ్యూటీ నారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమననపల్లి సైదులు తో కలిసి పాల్గొని మాట్లాడారు.

గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు వరుసగా రూ.15,000, రూ.10,000, రూ.7,500 ప్రోత్సాహకాలు అందించినట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది ఆ ప్రోత్సాహకాలను పెంచుతూ, మొదటి స్థానం వారికి రూ.25,000, ద్వితీయ స్థానం వారికి రూ.15,000, తృతీయ స్థానం వారికి రూ.10,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాల్లాంటివని, గ్రామస్థులందరూ కలిసి వాటి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిలో చాలామంది ప్రభుత్వ బడుల్లోనే చదివారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.

తన తల్లి పేరుతో నడుస్తున్న సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం కొనసాగిస్తానని చెప్పారు.అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేయడంలో తమ వంతు పాత్ర ఉందని పేర్కొన్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తున్నదని తెలిపారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త సబ్‌స్టేషన్లను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.