9 April, 2026 | 8:00 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

09-04-2026 06:01 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ,(విజయక్రాంతి): హెచ్ఐవి గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి అవగాహన కార్యక్రమాలు,సదస్సులు నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాలలో బాగంగా హెచ్ఐవి అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి  మాట్లాడుతూ హెచ్ఐవి గురించి ఇంకా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు, ఆశాలు ,స్వచ్ఛంద సంస్థలు ముందు వరుసలో ఉండి హెచ్ఐవి నియంత్రణకు కృషి చేస్తున్నారని, వారు నిత్యం ప్రజల్లో ఉంటారని ప్రజలతో ఉన్న సాన్నిహిత్యంతో అవగాహన ,నిర్ధారణ పరీక్షలు చికిత్స విధానం గురించి ప్రజలకు వివరించాలన్నారు.

హెచ్ఐవి గురించి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల కృషిని కలెక్టర్ అభినందించారు. వైద్యరంగంలో ఇప్పటికే చాలా పురోగతి ఉందని హెచ్ఐవి విషయంలో కూడా గర్భిణీ నుండి పిల్లలకు రాకుండా నివారించడానికి కూడా మంచి వైద్యం అందుబాటులో ఉందని, ట్రాన్స్ జెండర్లు, వలస కార్మికులు,  ఇతర హై రిస్క్ గ్రూపులకు చెందిన వారికి ఈరోజు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సురక్షితమైన జీవన విధానంతో హెచ్ఐవి నివారణ సాధ్యమని,హెచ్ఐవి బారీనపడిన వారి పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదన్నారు. ర్యాలీ అనంతరం అదాలత్ కూడలి వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది.పట్టణ ఆరోగ్య కేంద్రాలు పోచమ్మకుంట , లష్కర్ సింగారం,శాయంపేట ఏఎన్ఎంలు, ఆశాలు ఇతర సిబ్బంది,  సెయింట్ ఆన్స్ , సెయింట్ జోసెఫ్, ఫాదర్ కొలంబో నర్సింగ్ విద్యార్థులు , మారి, లోడి,ఆర్ డి ఎం ఎం, వార్డ్ ట్రకర్స్, వార్డ్ మై గ్రాంట్స్, వన్ స్టాప్ సెంటర్, లింక్ వర్కర్స్ స్కీమ్, పాజిటివ్ నెట్వర్క్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరి ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్  మదన్ మోహన్ రావు , డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ రుబీనా, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, కమలాకర్, డెమో వి.అశోక్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి ఎస్. శ్రీనివాస్ ,ఓ.చంద్రశేఖర్, మాధవ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఏ ఆర్ టి ,ఐ సి టి సి ,డి ఎస్ ఆర్ టి సి ఎస్ ఎస్ కె సిబ్బంది ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.