2 September, 2026 | 2:47 AM

రాష్ట్ర కార్యాలయంపై దాడిని బీజేపీ శ్రేణులు

02-09-2026 | 12:41am

మెట్ పల్లి, సెప్టెంబర్1(విజయక్రాంతి):హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని పిరికిపంద చర్యగా బీజేపీ పట్టణాధ్యక్షులు దొనికెల నవీన్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుతూ ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ ముగిసి దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ తన అరాచక ధోరణిని మార్చుకోలేదని మండిపడ్డారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను కాలరాసేలా కాంగ్రెస్ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఖండనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను, ప్రతిపక్ష గొంతుకను అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్, పట్టణ ప్రధాన కార్యదర్శి జంగుల అనిల్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల జగదీశ్వర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, వైస్ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, కౌన్సిలర్లు పుడుకారం కిషోర్ రెడ్డి, బొడ్ల నాగేష్, ఉపాధ్యక్షులు కొయ్యల లక్ష్మణ్, భోగ దత్తాత్రి, ఐటీ సెల్ కన్వీనర్ పాసికంటి శ్రీనివాస్, సంకు ప్రసాద్, తల్లోజీ భాస్కర్, కళాలి రాజారెడ్డి, బొడ్ల అనిల్, సుంకే అశోక్, తోకల సత్యనారాయణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.