బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
- పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ గేటు వద్దకు ఆటోలో వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- కాంగ్రెస్ వైఫల్యాలపై కార్యకర్తలతో ఆందోళన
- అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
- రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రాజీలేని పోరాటం: రాంచందర్‌రావు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూ, ఎన్నికల హామీల అమలును డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం వందలాదిగా తరలివచ్చి న కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పో లీసుల కళ్లుగప్పి సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించి నేరుగా అసెంబ్లీ ప్రధాన ద్వా రం వద్దకు చేరుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ గేటు వద్ద నిరసనకు దిగారు. అసెంబ్లీ ముట్ట డి నేపథ్యంలో నగరం నలుమూలల పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నేతల ను అర్ధరాత్రి నుంచే గృహనిర్బంధం చేశా రు. అయితే, పోలీసుల వ్యూహాన్ని చిత్తు చేస్తూ రాంచందర్‌రావు వ్యూహాత్మకంగా ఆ టోలో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు.
ఆయనను గుర్తించేలోపే పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీ పరిసరాలను హోరెత్తించారు. నాంపల్లి నుంచి వందలాది మంది కార్యకర్తలు బారికేడ్లను దాటుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించారు. దాదాపు 150 మంది మహిళా కార్యకర్తలు, యువమోర్చా సభ్యులతో కలిపి మొత్తం 800 మందిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
వంచన తప్పా ఏముంది?
అరెస్ట్ అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వచ్చి 26 నెలలైనా ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉ చిత బస్సు ప్రయాణం తప్పా మిగతావన్నీ అటకెక్కాయి. రైతులకు రూ.45 వేల వరకు రైతు భరోసా బకాయిలు ఉన్నాయి. రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థుల భవిష్యత్తు అం ధకారంలో పడింది’ అని చెప్పారు. అబద్ధపు ప్రచారంతో కాలం వెళ్లదీస్తున్న ఈ ప్ర భుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి అని ఆయ న హెచ్చరించారు.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం మొండివైఖరిని వీడాలని డిమాం డ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాంచందర్‌రావును బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమ ణారెడ్డి, పాయల్ శంకర్, ధనపాల్ సూర్యనారాయణ పరామర్శించారు. అప్రజాస్వామి కంగా అరెస్టులు చేయడం ద్వారా ఉద్యమా న్ని ఆపలేరని వారు స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్‌ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సాయంత్రం పంజాగుట్ట పోలీసులు రాంచందర్ రావును విడుదల చేసినప్పటికీ, ప్రభుత్వ తీరుపై పోరాటం ఆపే ది లేదని ఆయన ప్రకటించారు. బడ్జెట్‌లో హైదరాబాద్ అభివృద్ధికి మొండిచేయి చూపారని, విద్యా వైద్య రంగాలను విస్మరించారని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనపై ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని కాషాయ శ్రేణు లు ప్రకటించారు.
ప్రభుత్వ తీరును నిరసించే హక్కు ప్రతిపక్షాలకు లేదా?
- అక్రమ అరెస్టులతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరు
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యం లో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సహా సీనియర్ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభు త్వంలో నెలకొన్న అభద్రతాభావానికి అద్దంపడుతోందని ఈమేరకు సోమవా రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసించే హక్కు కూడా ప్రతిపక్ష పార్టీలకు లేకుండా చేస్తున్న కాం గ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వా మ్య పాలన నడుస్తోందా? లేక పోలీస్ బలగాలతో పాలిస్తున్నారా? అని నిలదీశారు.
శాంతియుతంగా నిరసన తెలిపేందు కు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్టులు, లాఠీచార్జీలతో ప్రజాసమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని అణచివేయలేరని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలకులను గద్దెదించేవరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే, రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.




