కార్యకర్తలే పార్టీకి బలం.. కుటుంబానికి ఆర్థిక సహాయం
24-08-2026 09:11 PM
- బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్
గంభీరావుపేట,(విజయక్రాంతి): గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కార్తీక్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించి బీజేపీ నాయకులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రూ.5 వేలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మండల అధ్యక్షుడు కోడె రమేష్ మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి బలం అని, వారి కుటుంబాలకు అండగా నిలవడం బీజేపీ కుటుంబ విలువలకు నిదర్శనమని తెలిపారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.






