మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు
24-08-2026 10:32 PM
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో సోమవారం మణుగూరులో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆళ్లపల్లి మండల టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి ఆళ్లపల్లి మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు మహమ్మద్ ఆదామ్ వేమూరి రాంబాబు వార్డు సభ్యులు తాళ్లపల్లి ఎల్లా గౌడ్ కొమరం వెంకట కృష్ణంరాజు కొంపెల్లి సాంబయ్య మురారి, ఆంబోజు నవీన్ తదితరులు రేగాను మర్యాదపూర్వకంగా కలిసి మండల సమస్యలు, తదితర విషయాలపై చర్చించడం జరిగిందని తెలిపారు.






