వనమహోత్సవ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి
24-08-2026 09:13 PM
వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కొండా సురేఖ
భూపాలపల్లి, ఆగస్టు 24 (విజయ క్రాంతి): వనమహోత్సవం2026లో జిల్లాలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను సెప్టెంబర్ చివరి వారంలోగా నూరు శాతం పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుండి కలెక్టర్లు, అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 25.26 లక్షల మొక్కలు నాటే లక్ష్యం కాగా, ఇప్పటివరకు 19.37 లక్షల మొక్కలు నాటినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని కూడా అన్ని శాఖల సమన్వయంతో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ బాలకృష్ణ, ఎఫ్డీఓ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.






