23 July, 2026 | 1:05 AM

బిస్లరీ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి

23-07-2026 12:09 AM

కార్మికుల పోరాటానికి సీఐటీయూ సంఘీభావం

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు  

పటాన్చెరు, జూలై 22 : పటాన్చెరువు మండలం పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని బిస్లరీ పరిశ్రమల్లో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు.  గత 42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికులకు సంఘీభావంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చుక్క రాములు హాజరై బిస్లరీ కార్మికులకు బియ్యం కిరాణం సరుకులను అందజేశారు. 

ఈ కార్యక్రమానికి బిస్లరీ యూనియన్ అధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ అధ్యక్షతన వహించారు..ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ బిస్లరీ యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే వీధిలోకి తీసుకోవాలని, బిస్లరీ కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని, యాజమాన్యం మొండివైఖరి మానుకొని కార్మికుల సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.  యాజమాన్యం సమస్యను పరిష్కరించక పోవడంతో కార్మికుల సమ్మెలోకి రావలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే అధికారులను కార్మిక శాఖ మంత్రి లేబర్ కమిషనర్ కలిశామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి.సాయిలు, జిల్లా కోశాధికారి కె రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాజు, కిర్బి యూనియన్ జనరల్ సెక్రెటరీ వి.ఎస్ రాజు, శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ప్రదీప్, పార్లే యూనియన్ జనరల్ సెక్రెటరీ సంతోష్ గౌడ్, పెబ్ పెన్నార్ వర్కింగ్ ఫ్రెండ్ మల్లేష్ జన సెక్రెటరీ శ్రీనివాస్ వాగ్బాల్స్ జనరల్ సెక్రెటరీ ఆఫీజ్ నాయకులు తలారి శ్రీనివాస్ సుధాకర్ మల్లేష్ లకన్ విట్టల్ రాజిరెడ్డి శ్యాంబాబు శంకర్ జైపాల్ మహేశ్వర్ రెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు..