నల్ల చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే
కూకట్‌పల్లి, జూలై 22 (విజయక్రాంతి): కూకట్పల్లి నల్లచెరువు వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు హైడ్రా అధికారులకు సూచించారు. బుధవారం కూకట్ పల్లి నల్ల చెరువులో హైడ్రా అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెరువు వద్ద ప్రజలకు కావలసిన త్రాగు నీరు, టాయిలెట్స్ ఏర్పాటు ఏర్పాటు చేయాలనీ హైడ్రా అధికారులకు సూచించారు.
ఇండోర్ స్టేడియం యోగ కేంద్రము నిర్మించాలన్నారు.అభివృద్ధి పనులకు నిధులు లేని యెడల తన ఎమ్మెల్యే నిధులనుండి మంజూరు చేస్తానన్నారు.గత కేసీఆర్ ప్రభుత్వం లోనే నల్ల చెరువు అభివృద్ధికి పూనుకున్నామని అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను కొనసాగించిదాన్నారు.
దీనిలో భాగంగానే పెండింగ్ లో వున్న టాయిలెట్స్ ఇతర అభివృద్ధి పనులను పూర్తిచేసేలా హైడ్రా అధికారులకు సూచించానని అయన తెలిపారు.నల్ల చెరువు మెయింటనెయన్స్ మొత్తాన్ని సి ఎం సి అధికారులకు బాధ్యతలు భదిలి అయ్యో విధంగా సూచిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రంగారావు, నాయకులు తులసీరావ్,ప్రభాకర్,బొట్టు విష్ణు, హైడ్రా అధికారులు, కాలనీ అసోసియేషన్ ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






