ఘనంగా బిఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు
13-06-2026 06:27 PM
మనోహరాబాద్,(విజయక్రాంతి): బిఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు మనోహరాబాద్ మండలం కాళ్లకల్ బంగరమ్మ దేవాలయం వద్ద ఘనంగా బిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. ముందుగా బంగారమ్మా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందారు. తన కొరకు ఏర్పాటు చేసిన బర్త్ డే కేక్ కట్ చేసుకొని నోరు తీపిచేసుకున్నారు.






