13 June, 2026 | 7:53 PM

పట్టణంలో కోతుల పట్టివేత

13-06-2026 06:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని షేక్ సాహబ్ పేట్ లో నిర్వహించిన ప్రత్యేక కోతుల పట్టివేత కార్యక్రమంలో మొత్తం 62 కోతులను పట్టుకొని కవ్వాల్ అటవీ ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.పట్టుబడిన కోతులను కవ్వాల్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ Saleh Tabassum (Shakir) శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.