22 April, 2026 | 2:30 PM

Breaking News

షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •  

ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

19-11-2025 03:47 PM

చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ దగ్గర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు. పండ్లు, స్వీట్లు పంచి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేనని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.