22 April, 2026 | 1:05 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన

19-11-2025 02:31 PM

భారతదేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన

నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు: తన పరిపాలన దక్షతతో భారత దేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని చిట్కూల్ లోని ఆయన నివాసం వద్ద, పేదలకు ఆమె అందించిన సంక్షేమాని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ... పేదలకు సంక్షేమం, అభివృద్ధిని దగ్గరికి చేసి భారతీయుల గుండెలో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆనాడు ఆ మహానేత  ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో సీఎం  రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుందని వివరించారు.