ఇండియన్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ
ఆచార్య పఫుల్ల చంద్రరాయ్ జన్మదినోత్సవం
సదాశివ నగర్, ఆగస్టు 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల0 మర్కల్ గ్రామంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇండియన్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ జన్మదినోత్సవం ఆదివారం నిర్వహించారు. జాతీయ రసాయన శాస్త్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, ఆచార్య ప్రఫుల్ల చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు.
రసాయన శాస్త్ర విభాగాధిపతి మీనా, ప్రఫుల్ల చంద్ర రసాయన శాస్త్రానికి అందించిన సేవలను గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు కూడా రసాయన శాస్త్ర గొప్పదనం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. కెమిస్ట్రీ పరీక్షలో ఉన్నత ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, రసాయన శాస్త్ర అధ్యాపకురాలు ఝాన్సీ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.






