2 July, 2026 | 12:04 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

పంటను కాపాడుకునే ప్రయత్నంలో రైతు వేసిన వలలకు చిక్కి అరుదైన పక్షుల మృతి

29-04-2026 03:35 PM

బోథ్,(విజయక్రాంతి): నేరడిగొండ మండల కేంద్రం సమీపంలోని దాబా హోటల్ వెనుక అడవిని ఆనుకుని ఉన్న చేనులో ఉన్న పంటను కాపాడుకునేందుకు ఓ రైతు పంట చేను చుట్టూ వలలు వేయడం జరిగింది. అయితే అటవీ సమీపంలో ఉన్న చేనులోకి రామచిలకలతో పాటు వివిధ రకాల అరుదైన జాతుల పక్షులు వచ్చి వలలో చిక్కుకుంటున్నాయి.

వలలు చిక్కుకున్న పక్షులు ఎండల తీవ్రతతో అక్కడికక్కడే మృతి వాత పడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు రైతుకు కౌన్సిలింగ్ ఇచ్చి వలను తొలగించే విధంగా చేయాలని పలువురు కోరుతున్నారు. పంటను రక్షించుకునేందుకు రైతు వేసిన వల పక్షులకు ప్రాణ సంఘటనగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.