29 April, 2026 | 7:38 PM

జైపూర్ ఎస్‌ఐగా భూమేష్ బాధ్యతల స్వీకరణ

29-04-2026 03:30 PM

జైపూర్,(విజయక్రాంతి): జైపూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా భూమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, గంజాయి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మహిళలు, బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రజలు పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా స్టేషన్‌కు రావాలని కోరారు.