22 May, 2026 | 10:25 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

బిగ్ హెల్ప్-గోల్డెన్ స్టార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవార్డుల ప్రధానం

15-12-2025 10:08 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్మపల్లిలోని జెడ్పిహెచ్ఎస్ లో ఎస్ఏ-1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు ప్రతి తరగతిలో టాప్ 10 మంది విద్యార్థులకు బిగ్ హెల్ప్-గోల్డెన్ స్టార్ ఆధ్వర్యంలో సోమవారం అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శ్రీదేవి, ఆసంస్థ ఉభయ రాష్ట్రాల సెక్రటరీ, పాఠశాల పీడీ మల్లేష్ మాట్లాడుతూ బిగ్ హెల్ప్ సంస్థ చైర్మన్ షేక్ చాంద్ పాషా సౌజన్యంతో పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రులు లేని 15 మంది విద్యార్థులకు ప్రతినెల వారికి కావలసిన వస్తువులతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్న చాంద్ పాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు దాతల సహకారాన్ని ఉపయోగించుకుని, క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుకర్ ,రమేష్,శోభారాణి,సునంద, అంజలి,అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.