31 July, 2026 | 5:03 AM

ఆషాఢం హంగామాతో భాగ్యనగర్ మహిళా సంఘం సందడి

31-07-2026 12:00 AM

నాగోల్, జూలై 30 (విజయ క్రాంతి): చైతన్యపురి డివిజన్లో భాగ్యనగర్ మహిళా సంగమ్ ఆధ్వర్యంలో ఆషాఢం హంగామా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి నాయుడు హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఐక్యత, సేవా భావం సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆమె పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా సంఘ సభ్యుల సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన ఓ పేద విద్యార్థికి పాఠశాల ఫీజును అందజేసి విద్యాభ్యాసానికి చేయూతనిచ్చారు.

అనంతరం మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ఆషాఢ మాస విశిష్టతను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ మహిళా సంగమ్ అధ్యక్షురాలు ఉప్పల నిర్మల, కార్యదర్శి ప్రశాంతి గుప్త, కోశాధికారి సి. పావని, ఉపాధ్యక్షురాలు శ్రీవాణి చౌదరి, అదనపు కార్యదర్శి పి.ఆర్. శ్రీదేవి, కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.