17 August, 2026 | 9:18 PM

వాట్సాప్ చిట్కాతో

17-08-2026 07:58 PM

వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా 24/7 సేవలు 

నిర్మల్, ఆగస్టు 17 (విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ విస్తృతంగా వినియోగిస్తోంది. జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ రమేష్ తెలిపారు

ఇందులో భాగంగా 24 గంటలు, 7 రోజులు అందుబాటులో ఉండే వాట్సాప్ చాట్‌బాట్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, సేవల వివరాలు, బిల్లింగ్, కొత్త విద్యుత్ సర్వీసు కనెక్షన్ తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు.

చాట్‌బాట్ నంబర్: 87124 81489

వినియోగదారులు పై నంబర్‌ను తమ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో hi అని మెసేజ్ పంపడం ద్వారా అందుబాటులో ఉన్న వివిధ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదుల నమోదు, బిల్లింగ్, కొత్త విద్యుత్ సర్వీసు కనెక్షన్, సోలార్ కు సంబంధించిన సమాచారం తదితర సేవలను సులభంగా పొందవచ్చన్నారు.

విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంస్థ టోల్‌ఫ్రీ నంబర్ 1912, ఏఐ వాట్సాప్ చాట్‌బాట్, మొబైల్ యాప్, వెబ్ సైట్ తదితర ఆధునిక సేవా మార్గాలను మరింత బలోపేతం చేసిందని తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదులను నమోదు  పరిష్కరిస్తామన్నారు.