30 June, 2026 | 9:05 PM

Breaking News

ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •  

సాదాసీదాగా కౌన్సిల్ సమావేశం

30-06-2026 07:56 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ సమావేశం సాదాసీదాగా జరిగింది. మున్సిపల్ చైర్పర్స్ దావ స్వాతి దావ స్వాతి అధ్యక్షతన మంగళవారం సమావేశం మందిరంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండా అంశాలను సభ్యులు ఆమోదించారు. ఎజెండాలోనీ 10 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 

తీర్మానాలు:

1.పట్టణ అభివృద్ధి పనుల నాణ్యత పరిశీలనకు క్వాలిటీ చెకింగ్ ల్యాబ్ నియామకానికి ఆమోదం.

2. డంపింగ్ యార్డులో విద్యుత్ స్తంభాలు. ట్రాన్స్ ఫార్మర్ తదితర విద్యుత్ సౌకర్యాల ఏర్పాటుకు రూ. 3,45,650/- లక్షలకు ఆమోదం.

3. పట్టణంలోని రోడ్లపై గుంతల పూడిక పనులకు రూ. 2.00 లక్షలకు ఆమోదం.

4. పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ కోసం జేసీబీ అద్దెకు తీసుకోవడానికి రూ. లు 5.00 లక్షలకు ఆమోదం.

5. వివిధ వార్డుల్లో నూతన వీధి దీపాల ఏర్పాటు, పాత దీపాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయుటకు రూ. 1.00 లక్షలు ఆమోదం.

6. ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు కోసం ట్రీ కటింగ్ మెషిన్ కొనుగోలుకు రూ. 20,000/- లకు ఆమోదం.

7. స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా ఫ్లైఓవర్పై వాల్ పెయింటింగ్స్, నినాదాల రచనకు రూ. 4.29 లక్షలకు ఆమోదం.

8. ఫ్లైఓవర్ కుండీలలో మొక్కల నాటడానికి మొక్కల కొనుగోలుకు రూ. 20,000/-లకు ఆమోదం.

9. ఇంజనీరింగ్ విభాగం కోసం చాంబర్ మరమ్మత్తులు, పునరుద్దరణ పనులకు రూ.  5.00 లక్షలకు ఆమోదం.

10. 8, 17, 34 వార్డుల్లో సి.సి. డ్రెయిస్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు రూ. 3.00 లక్షలకు ఆమోదం. కౌన్సిల్ సమావేశంలో  మునిసిపల్ వైస్ చైర్మన్  సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, డి.ఈ. సుమతి, ఏ.ఈ. నిఖిల్, సభ్యులు మున్సిపాలిటీ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.