30 June, 2026 | 9:14 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్

30-06-2026 07:59 PM

దమ్మపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎలక్షన్ ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామంలోని 106వ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, సర్ ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. దమ్మపేట మండలంలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న బూత్ స్థాయి అధికారులు అత్యంత ప్రతిభావంతంగా, అద్భతమైన పనితీరు కనబరుస్తున్నారని అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఉత్సాహంతో నిర్దేశిత గడువులోగా ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.