కనిపించే అందం వెనుక బోలెడు కష్టాలు!
టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం ఒక సరైన బ్రేక్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంటుందని అంతా భావిం చారు. కానీ, ఈ ము ద్దుగుమ్మకు తర్వాత చేసిన సినిమాలతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కిం చుకుంటున్నా, బాక్సాఫీస్ వద్ద అవి ఫ్లాపు లుగా మిగిలిపోతుండటంతో నిధికి అదృ ష్టం కలిసి రావడం లేదు. ఇటీవల ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’, పవన్‌కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ వంటి చి త్రాలు కూడా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
దీంతో కెరీర్ మందగమనంలో పడటంతో ఆమె ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇం టర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్.. ఒక హీరోయిన్ మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చుల గురించి సంచలన విషయాలు వెల్లడించింది. సాధారణంగా ప్రేక్షకులు వెండితెరపై హీరోయిన్ల గ్లామ ర్‌ను చూసి మురిసిపోతుంటారు. కానీ, ఆ అందాన్ని కాపాడుకోవడానికి తాము పడే కష్టం, ఖర్చు వేరే స్థాయిలో ఉంటాయని నిధి వివరించింది.
“ఒక నటి జీవనశైలి చాలా ఖరీదైనది. కేవలం ప్రయాణాలు, వసతి, పౌష్టికాహారం, జిమ్, పార్లర్ కోసం నెలకు దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏదైనా సినిమా ప్రమోషన్స్ లేదా ఈవెంట్లకు వెళ్లాల్సి వస్తే, ఆ ఒక్కరోజు స్టైలింగ్, మేకప్, హెయిర్ స్టైల్, ఫోటోగ్రఫీ కోసం సుమారు రూ.లక్ష ఖర్చు చేయక తప్పదు” అని చెప్పుకొచ్చింది. మొత్తానికి కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఈ స్థాయి ఖర్చులు హీరోయిన్లకు తప్పవని నిధి చెప్పిన మాటలో మంచి ఉదాహరణ.






