13 August, 2026 | 6:11 PM

ఆసరా పెన్షన్ల కోసం కదం తొక్కిన బీడీ కార్మికులు

13-08-2026 04:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ... అర్హులైన బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి.

పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన బీడీ కార్మికుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి పెన్షన్ మంజూరు చేయాలి. వృద్ధాప్యంలో ఉన్న బీడీ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించాలి. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల ఈ కార్యక్రమంలో బీడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.బక్కన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రామలక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.గంగన్న, జిల్లా కోశాధికారి ఎండి గఫూర్, జిల్లా కమిటి సభ్యులు కే.లక్ష్మీ, ఎస్. లక్ష్మీ, జిల్లా నాయకురాలు వి.గోదావరి. CPI(ML) మాస్ లైన్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.