కామారెడ్డి యశోద హాస్పిటల్‌లో రోగికి అరుదైన చికిత్స
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి యశోద మెడికల్ సెంటర్‌లో ఓ రోగి కి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బి శృతి సాగర్ తెలిపారు. కామారెడ్డి లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అన్నం, నీరు మింగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 40 ఏళ్ల వ్యక్తికి అధునాతన పీఓఈఎం (పర్సనల్, ఎండోస్కోపి, మైతో మై) చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దగా కోతలు లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఈ చికిత్స నిర్వహించి, రోగికి మింగడంలో ఉన్న ఇబ్బందిని తగ్గించినట్లు వెల్లడించారు.
ఈ చికిత్స ను డా.బి.శృతి సాగర్, ఎండీ, డీఎం (గ్యాస్ట్రో), డా.శృతి సాగర్ లు నిర్వహించినట్లు తెలిపారు. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, మ్యానోమెట్రీ, ఈ ఆర్సీపీ, ఈయుఎస్ వంటి అధునాతన గ్యాస్ట్రోఎంటరాలజీ విధానాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉందన్నారు. కామారెడ్డి యశోద మెడికల్ సెంటర్‌లో ఇలాంటి అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉండటం ద్వారా స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ అవకాశాలను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.






