19 March, 2026 | 8:10 AM

బీసీలు ఐక్యంగా ఉద్యమించాలి

19-03-2026 02:08 AM

ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న 

ఎల్బీనగర్, మార్చి 18 : రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా ఉద్యమించాలని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న పిలుపునిచ్చారు. నాగోల్ లోని మన ఆలోచన సాధన సమితి (మాస్)వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు నివాసంలో గురువారం తెలంగాణ ప్రజా గాయకుడు ఏపూరి సోమ న్నను కలిశారు. ఏప్రిల్ 19న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న జన జాగరణ జాత ర కార్యక్రమానికి ఏపూరి సోమన్న పూర్తి మద్దతు ప్రకటించారు. 

జన జాగరణ జాతర కార్యక్రమానికి బీసీ కులాలు, నాయకులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి గుణగంటి చంద్రశేఖర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెదవుర బ్రహ్మయ్య, దువ్వాల శ్రీకాంత్,  కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర, తదితరులు పాల్గొన్నారు.