19 March, 2026 | 5:17 AM

వారానికో సమస్య!

19-03-2026 02:08 AM
  1. బాసర త్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది?
    1. వరస ఘటనలతో అప్రతిష్ఠ?
    2. పట్టించుకోని వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్లు!
    3. నిరంతరం విద్యార్థుల ఆందోళనలు
    4. కలత చెందుతున్న తల్లిదండ్రులు

నిర్మల్, మార్చి 18 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీలో నెలకొన్న సమస్య లు, విద్యార్థుల వరుస మరణాలతో అసలు ఏం జరుగుతున్నదన్న సందేహం కలుగుతున్నది. వారానికో సమస్య మీద విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. తమ పిల్లల ఉజ్వల భవిష్యతు కు బాసర త్రిపుల్ ఐటిలో అడ్మిషన్ తీసుకున్న సంబరం ఆ తర్వాత తల్లిదండ్రులు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రతిరోజు పిల్లలకు ఫోన్లు చేసి, క్షేమమేకదా అంటూ వాకాబు చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలను అధికారులు, వైస్ ఛాన్స్‌లర్ పట్టించుకో వడం లేదని తెలుస్తున్నది. ఏళ్ల తరబడి పరిష్కా రం కానీ సమస్యలు, అరకొర నిధులు, నిర్వహణ లోపాలు, ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు వి ద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. బాసరలో మొత్తం 9వేల విద్యార్థులు చదువుతున్నారు. సమస్యలపై ఎప్పటికప్పుడు తెలం గాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలి డాట్ (జేఏసీ)గా ఏర్పడి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. 

నిర్వహణ లోపం

ప్రొఫెసర్లు, వైస్ ఛాన్స్‌లర్, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేయాల్సి ఉన్నా బాసరలో ప్రొఫెసర్లు మరోవైపు, నిర్వాణ ఏజెన్సీలు ఇంకోవైపు, వైస్ ఛాన్స్‌లర్ ఒక వైపు ఇలా ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా వారి తీరు ఉన్నది. గత వారం రోజుల క్రితం హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, తాజాగా మరో విద్యార్థిని త్రిబుల్ ఐటీ హాస్టల్‌లో అనారోగ్యానికి గు రైంది. నిర్వాహకులే హైదరాబాదుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

దీనికి నిర్వహణలోపమే కారణమని, వైద్యం కూడా అందిం చలేని దుస్థితి ఉన్నదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమం టూ రెండు రోజులుగా (సోమవారం నుం చి బు ధవారం ఉదయం వరకు) రోజులుగా వైస్ ఛాన్స్‌లర్ ఓఎస్డీ కార్యాలయం ముందు నిరసన తెలుపు తున్నారు. మంగళవారం రాత్రి ఎస్పీ జాన కి షర్మి ల వెళ్లి, విద్యార్థులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. అయితే బుధవారం ఉదయం తిరిగి విద్యార్థులు ఆందోళన చేపట్టడం గమనార్హం.

వైస్ ఛాన్స్‌లర్‌ను తొలగించండి!

ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసిన విద్యార్థి సంఘాలు తాజాగా విశ్వవిద్యాలయం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్ ఓఎస్‌డి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఆందోళన చేయడం బాసర విశ్వవిద్యాలయ చరిత్రలోనే ప్రథమం కావడం విశేషం. ఇటీవలి త్రిబుల్ ఐటీని సందర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య దృష్టికి కూడా ఈ విషయం వెళ్లింది. పది రోజుల క్రితం ఓ రాజకీయ పార్టీ మానవ హక్కుల సం ఘానికి ఫిర్యాదు చేసింది. ఇదంతా గత 15 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. 

విద్యార్థుల స్వార్థ కోసం ఆందోళనలు!

బాసర త్రిబుల్ ఐటీ లో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్ర సారమవుతున్న ఘటనలు కళాశాలలో మరింత ఆజ్యం పోస్తున్నాయి. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఆందోళన పేరుతో అప్రతిష్ఠపాలు చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు వార్తలు రాగా అటువంటి ఘటన జరగలేదని జిల్లా పోలీసులే స్వయంగా ప్రకటించుకోవలసి వచ్చింది.

దీనికి తోడు విద్యార్థులతో చర్చలు జరుపుతున్న ఓ ప్రొఫెసర్.. ‘చదువుకోడానికి వచ్చారా, ఉద్యమాలు చేయడానికి వచ్చారా, మీ భవిష్యత్తు మీరే నాశనం చేసుకుంటున్నారు. సమస్యలు ఉం టే చెప్పండి. కానీ చదువుకునే విద్యార్థులు అల్లర్లు చేస్తే ఎట్లా? చదువుకునే పిల్లలకు మీరు నష్టం కలిగిస్తలేరా? మీ వల్ల విశ్వవిద్యాలయం ప్రతిష్ఠ దెబ్బ తింటుంది.

ఇట్లా చేస్తే కంపెనీలు రావు. ఉద్యోగాలు దొరకవు. మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకుంటున్నారు. మేం మీకోసం పనిచేస్తున్నాం. మా మాట కూడా వినడం లేదు. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చేస్తు న్నారు’ అంటూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అసలే పరీక్షల సమయం, ఇప్పుడు ఇటువంటి ఘటనలు జరగడం అటు తల్లిదండ్రులను ఆందోళన గురిచేస్తుంది. 

సమస్యల పరిష్కారానికి కృషి గోవర్ధన్, వైస్ ఛాన్స్‌లర్ 

బాసర త్రిబుల్ ఐటీలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థి నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను, వివరించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజు పర్యవేక్షణ చేసి ప్రతి విద్యార్థి పరిస్థితి, విద్యా ప్రగతి, సదుపాయాల కల్పన తదితర అంశాలపై దృష్టి పెడుతున్నాం. విద్యార్థులకు న్యాయం జరిగేటట్లు కృషి చేస్తాం. విద్యార్థులు కూడా శాంతి యుతంగా పోరాటం చేస్తే బాగుంటుంది.