సమగ్ర కులగణన చేపట్టాలి
బీసీ రిజర్వేషన్లు పెంచాలి
డిమాండ్లను పరిష్కరించకుంటే ఢిల్లీని ముట్టడిస్తాం
బీసీ మహా ధర్నాలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): రాజ్యాంగబద్ధంగా విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీల వాటా బీసీలకే దక్కాలంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసి న శంకర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌లో బీసీ డిమాండ్లపై మహా ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాలో వారు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు పెంచకపోవడం వల న బీసీలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సామాజిక రిజర్వేషన్లు అయినా ఎస్సీ, ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఇదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పించినప్పుడు దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60 శాతం చేరుకున్న సందర్భంలో 50 శాతం పరిమితి వి ధించకపోవడం చాలా అన్యాయమన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవ న్ కళ్యాణ్ తక్షణమే జోక్యం చేసుకొని ప్రస్తు తం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టేలా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లులో సబ్‌కోటా కల్పించకపోతే లక్ష్యం నెరవేరదని మహిళా బిల్లు పేరుతో మళ్లీ అగ్రకు లాల పా లనే మొదలవుతుందని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్ని కలు కులగణాంకాలు చేపట్టిన తర్వాత, బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ల హామీని నెరవేర్చిన తర్వాతనే నిర్వహించాలని డిమా ండ్ చేశారు.
న్యాయమైన బీసీ డిమాండ్ లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని, అలాగే ఆగస్టులో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ఢిల్లీని ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్‌గౌడ్, కేసిన శంకర్ రావు లు హెచ్చరించారు. ఈ ధర్నాలో మేకల వెంకటేశ్వరరా వు, మహిళా ఉపాధ్యక్షురాలు జి.శ్వేత, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగుండ్లా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమ ల్లేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకారావు, రాష్ట్ర ఉద్యోగుల సంఘాల వర్కింగ్ ప్రెసిడెం ట్ ఉమా మహేశ్వరరావు, నగర అధ్యక్షులుచిప్పాడ చందు, కాశీమ్ పాల్గొన్నారు.






