11 July, 2026 | 4:13 AM

భక్తి శ్రద్ధలతో నృసింహునికి లక్ష పుష్పార్చన

11-07-2026 12:00 AM

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ             

యాదగిరిగుట్టలో నిర్వహణ                                          

యాదగిరిగుట్ట, జూలై 10 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చక స్వాములు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన పాంచరాత్రాగమానుసారంగా నిర్వహించారు. అలాగే స్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మ వారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. స్వామివారి నిత్య రాబడి రూ.24,48,718 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.