calender_icon.png 22 February, 2026 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరాలు.. గరీబోళ్లకు అపర సంజీవిని నిలయాలు

22-02-2026 06:08:55 PM

100 మందికి కంటి వైద్య పరీక్షలు

సంఘ సేవకుడు బూడిద వెంకటేష్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలు గరీబోళ్లకు అపర సంజీవని నిలయాలుగా నిలుస్తున్నాయని, మానవాళికి కంటిచూపు అత్యంత సున్నితమైనదని సంఘ సేవకుడు మదర్ తెరిసా కాలనీ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జవహర్ నగర్ లోని మదర్ తెరిసా కాలనీలో విన్ విజన్ హాస్పిటల్, ఎం ఎం ఫౌండేషన్, బాలవికాస ఆధ్వర్యంలో వెంకటేష్ సమక్షంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని అన్నారు.

సర్వేంద్రియానం నయనం ప్రధానమని సర్వ ఇంద్రియాలకు నయనాలే ప్రధాన అవయవాలని ఆ నయనాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన శరీరంలో సున్నితమైన అవయవం కనులేనని, కంటి ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్కరు తగిన సూచనలు పాటించాలన్నారు. అనంతరం వందమందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, శివ నారాయణ, నరేష్, స్రవంతి, హేమవతి, వసంత, వినోద, రవి, మంజుల, చంద్రకళ, నాగమణి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.