06-02-2026 12:00:00 AM
ఎంపీ ఈటల రాజేందర్‌ను కోరిన బీజేపీ నాయకులు
ఎల్బీనగర్, ఫిబ్రవరి 5 : హస్తినాపురం డివిజన్ డివిజన్ ప్రజల కోసం ప్రభుత్వ దవాఖాన, పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్‌ను బీజేపీ నాయకులు కోరారు. హస్తినా పురంలో పట్టణ ప్రాథమిక వైద్యకేంద్రం, జడ్పీ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూ రు చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు స్థానిక నాయకులు వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాలని రంగా రెడ్డి కలెక్టర్‌ను ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. ప్రభుత్వం భూమిని కేటాయి స్తే, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి ఎంపీ కోటాలో నిధులు మం జూరు చేస్తానని ఈటల హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గజ్జల రాజు గౌడ్, డివిజన్ సెక్రెటరీ గౌని వెంకటేష్ గౌడ్, ఎస్టీ మోర్చా నాయకుడు మునీల్ నాయక్, డివిజన్ ఉపాధ్యక్షు డు శేఖర్ గౌడ్, దర్శి లక్ష్మి కాంత్ రెడ్డి పాల్గొన్నారు.