17 June, 2026 | 8:47 PM

Breaking News

కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •  

హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో భారీ క్యూలు — నిజంగా కొరత ఉందా? కేంద్రమంత్రి చెప్పింది ఇదే!

25-03-2026 03:06 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) వెల్లడించారు. సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని సూచించారు. ఆయిల్ సంస్థల వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని వివరించారు. ఆయిల్ సరఫరాలోనూ ఇబ్బందులు లేవని తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆయిల్ నిల్వలపై కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. అవసరానికి మించి కొనుగోళ్లతో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని బండి సంజయ్ హెచ్చరించారు.

ప్రజలు భయాందోళనలకు గురై పెట్రోల్, డీజిల్ నింపుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బుధవారం వాహనదారులకు హామీ ఇచ్చింది. భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని కోరింది. నగరంలో ఇంధన సరఫరా తగినంతగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, భయాందోళనలకు గురైన ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. జనాలు పొటేత్తడంతో పెట్రోల్ బంకుల్లో పోలీసుల బందోబస్తు నడుమ పెట్రోల్, డీజిల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు తగిలించగా, మరికొన్ని బంకుల్లోకి వాహనాలు రాకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టి మూసివేశారు.