కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి
17-06-2026 08:46 PM
తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ నిర్ణయం
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఒలంపిక్ దే రన్ 2026 చైర్మన్ గా డాక్టర్ ఎం జైపాల్ రెడ్డిని నియమకం చేశారు. తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ నిర్ణయం మేరకు కన్వీనర్ గా డాక్టర్ కె.పి అనిల్ కుమార్, సభ్యులుగా సందీప్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సాయి మౌర్య, లను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఒలంపిక్స్ డేరన్ 2026 చైర్మన్ గా డాక్టర్ జైపాల్ రెడ్డి ఎంపిక కావడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఒలంపి అసోసియేషన్ నిర్ణయం మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. సభ్యులకు అభినందించారు. ఈనెల 20న ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.






