27 March, 2026 | 2:10 PM

Breaking News

శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •   తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అన్నపర్తి జ్ఞాన సుందర్   •  

పొంచి ఉన్న ప్రమాదం

25-03-2026 03:04 PM

గుంజపడుగులో ప్రమాదకరమైన గుంత

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ప్రధాన రహదారి పక్కన పెద్ద గుంత ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. గుంజపడుగు బస్టాండ్ నుండి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారిపై ఇంత పెద్ద గుంత ఏర్పడిన సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుండా రోజు వందలాది వాహనాలు పోతూ వస్తూ ఉంటాయి. పక్కనే ఒక ప్రైవేటు పాఠశాల వాహనాలు సైతం పిల్లలతో వెళ్తూ ఉంటాయి.

వాహనదారులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. గుంజపడుగు నుండి ఉప్పట్ల గ్రామానికి వెళ్లే వాహనదారులకు కూడా ఈ ప్రమాదకరమైన గుంత సంకటంగా మారింది. బస్టాండ్ ప్రాంతం నుండి డ్రైనేజీని యూటర్న్ ద్వారా ఇటువైపు మరలచడంతో ఈ గుంట ఏర్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రమాదకరమైన గుంతను పూడ్చి డ్రైనేజీ ద్వారా నీరు సులభతరంగా వెళ్లడానికి ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.