15 June, 2026 | 11:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కార్యనిర్వాహక సభ్యులుగా బండారు రాజా ప్రమాణ స్వీకారం

12-06-2026 04:26 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బండారు రాజా శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవం లో రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యనిర్వాహక సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు గతంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తంతోపాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండారు రాజా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, నా వంతుగా శక్తివంచన లేకుండా ఆర్యవైశ్యుల అభివృద్ధి కొరకు కృషి చేస్తానని తెలిపారు. దీనితో తుంగతుర్తి నియోజకవర్గం ఆర్యవైశ్య మహాసభ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.