29 May, 2026 | 3:50 AM

తాడ్వాయిలో ఘనంగా బక్రీద్ పండుగ

29-05-2026 02:06 AM

తాడ్వాయి, మే, 28( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో గురువారం ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం సోదరులు కొత్త బట్టలు ధరించి ప్రార్థనలు నిర్వహించారు. మండలంలోని చందాపూర్, బ్రాహ్మణపల్లి, సంగోజీవాడి,నందివాడ, ఎర్రపహాడ్, చిట్యాల, తాడ్వాయి,కృష్ణాజివాడి, కరడ్పల్లి,దేమి కలాన్, కన్ కల్ గ్రామాల్లో పండుగ వేడుకలు నిర్వహించారు.