27 July, 2026 | 4:01 AM

షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన బేకరీ

27-07-2026 12:00 AM

కరీంనగర్ క్రైం, జూలై26(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న బీఆర్‌ఎస్ సీనియర్ నాయ కుడు నేతి రవివర్మకు చెందిన ’కేక్స్ అండ్ బేక్స్’ బేకరీలో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో బేకరీ పూర్తిగా కాలి బూడిదైంది.ఈ ప్రమాద వార్త తెలుసుకున్న మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేరుగా సంఘటన స్థలానికి చేరుకుని బేకరీని పరిశీలించారు. ప్రమాదం జరి గిన తీరు, ఆస్తినష్టం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పో లీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఘటన వివరాలను ఆరా తీశారు.