15 April, 2026 | 2:46 PM

Breaking News

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం: గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు మృతి   •   పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుల పరామర్శ   •   కొందుర్గు మండల కేంద్రంలో గ్యాస్ కొరత.. రోడ్డెక్కిన వినియోగదారులు   •   బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని మృతి   •   ఆదిలాబాద్ రోడ్లపై మంత్రి పొన్నం వాహన డ్రైవింగ్   •   విద్యాభ్యాసం మనిషికి విలువ తెస్తుంది   •   పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •  

గొప్ప అభ్యుదయ వాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్

14-04-2026 01:24 PM

అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్

అమీన్ పూర్: భారతదేశ చరిత్రలో అజరామరమైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అమీన్ పూర్ గ్రామ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు  అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోసమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ అనే విలువల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు.  అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అపారము అని కొనియాడారు. అంబేద్కర్  ఆలోచనలు ఈ రోజుకీ ప్రతి ఒక్కరికి ప్రేరణ అని. . సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం ఆయన చూపిన దారి మనందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, కృష్ణ, సునీత రాజేష్, యాదగిరి, దాసు యాదవ్, జ్ఞానేశ్వర్, రుశ్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.