17 April, 2026 | 2:12 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 01:26 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి) కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం బీఆర్ అంబేద్కర్  135వ జయంతి వేడుకలు ఘనముగా నిర్వహించారు .  పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా,  దీక్ష భూమిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మున్సిపల్ కమిషనర్ తిరుపతి,చైర్మన్   షాహిన్ సుల్తానా, వైస్ చైర్మన్ డాక్టర్ అనిత, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఏటుకూరి శ్రీనివాసరావు, సునార్కర్ అనిల్ కుమార్ PRTU TS జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త, విద్యావేత్త, బిఆర్ అంబేద్కర్ అని ,భారతదేశంలో వివిధ చట్టసభలకు రాజ్యాంగమే దిక్సూచిగా పనిచేస్తుందని, గ్రామ పరిపాలన వ్యవస్థ నుంచి దేశ పరిపాలన వ్యవస్థ వరకు రాజ్యాంగ స్ఫూర్తితో నిర్వహిస్తామని, బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం సూచించిన విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని , ఇంకో వెయ్యి సంవత్సరాల వరకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వర్ధిల్లుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు .